© 2026 nimisham.in
గతేడాది దసరా పండగ ముందు వరకూ మెగా హీరోల బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగాలేదనే చెప్పాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకూ.. అందరికీ వరుస ఫ్లాపులు పడ్డాయి.
మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే విజయదశమి తర్వాత మెగా ఫ్యామిలీ దశ దిశ మారింది. అప్పటి నుంచి మెగా హీరోల నుంచి వస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నాయా లేదా అనేది పక్కన పెడితే.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా చేశాయి.పవన్ కళ్యాణ్ OG సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు అందుకున్నారు. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ప్రాంతీయ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ‘పెద్ది’ చిత్రంతో రామ్ చరణ్ కూడా భారీ వసూళ్లు సాధించారు. ఇప్పుడు లేటెస్టుగా వరుణ్ తేజ్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. చాలా ఏళ్లుగా హిట్టు కోసం కష్టపడుతున్న వరుణ్.. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ఎట్టకేలకు మంచి సక్సెస్ సాధించారు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టారు.ఇలా నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇక మిగిలింది ఇద్దరు మెగా మేనల్లుళ్లు మాత్రమే. సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'బ్రో' సినిమా నిరాశపరిచింది. ఆ మూవీ వచ్చి మూడేళ్లు అవుతోంది. తేజ్ ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. లాస్ట్ ఇయర్ దసరాకే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈసారి దసరాకి రావడం కూడా కష్టమే అనిపిస్తోంది. ఇప్పటికైతే ఫస్ట్ లుక్, టీజర్ తో సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ మూవీని డిసెంబర్ లోరిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.మరోవైపు సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ చాలాకాలంగా హిట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమైన వైష్ణవ్.. డెబ్యూతోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరారు. కానీ ఆ తర్వాత ఆయనకు మరో సక్సెస్ దక్కలేదు. 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా', 'ఆదికేశవ' సినిమాలు వేటికవే డిజాస్టర్లుగా మారాయి. 'ఆదికేశవ' వచ్చి కూడా సుమారు మూడేళ్లు కావొస్తున్నా.. వైష్ణవ్ ఇంతవరకూ తన తదుపరి సినిమాని పట్టాలెక్కించలేదు. అసలు అతను ఏ సినిమా చేస్తున్నాడు? ఎవరి డైరెక్షన్ లో చేయబోతున్నాడు? వంటి వివరాలపై క్లారిటీ లేదు. ఎప్పుడొచ్చినా మెగా మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హిట్టు కొడితే.. మెగా ఫ్యామిలీలో మేజర్ హీరోలంతా సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే, మెగా డాటర్స్ సుష్మిత, నిహారిక కూడా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ అనిపించుకున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ రుచి చూశారు సుష్మిత. 'కమిటీ కుర్రాళ్లు', 'రాకాస' చిత్రాలతో నిహారిక కొణిదెల మంచి విజయాలు సాధించారు. అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన అన్న వరుణ్ తేజ్ తో 'బరి' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి రాబోయే రోజుల్లో 'విశ్వంభర', 'మెగా 158' సినిమాలు కూడా రాబోతున్నాయి. మరి ఈ విజయాల పరంపర కొనసాగుతుందో లేదో చూడాలి.