© 2026 nimisham.in

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
14 killed in Myanmar military airstrike: మయన్మార్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా సాయుధ ప్రజాస్వామ్య అనుకూల శక్తులు, జాతి సాయుధ సమూహాలను టార్గెట్ చేసి తరచుగా వైమానిక దాడుల్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మయన్మార్‌లోని మధ్య సగైంగ్ ప్రాంతంలో వారం రోజుల పాటు ధ్యాన శిబిరంలో పాల్గొంటున్న ఒక బౌద్ధ మఠంపై శుక్రవారం ఆ దేశ సైన్యం వైమానిక దాడుల్ని చేసింది. ఈ ఘటనలో ధ్యానంలో ఉన్న సుమారు 14 మంది దుర్మరణం చెందారు.
వీరిలో బౌద్య సన్యాసులతో పాటు, సాధారణ పౌరులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన మాండలేకు పశ్చిమాన సుమారు 75 కిలోమీటర్ల (45 మైళ్ల) దూరంలో ఉన్న స్వెల్ లే ఓహ్ గ్రామంలోఈ దాడి జరిగింది.
గ్రామంలోని మఠం ఆవరణలో ఒక జెట్ ఫైటర్ బాంబు వేయడంతో ముగ్గురు మహిళలతో సహా 14 మంది మరణించారని, మరో 20 మందికిపైగా మంది గాయపడ్డారని అక్కడి వారు చెబుతున్నారు. జెట్ ఫైటర్ 15 నిమిషాల వ్యవధిలో రెండు బాంబులను జారవిడిచిందని చెప్పారు.
Read more: Imran Khan Health Update:ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన.. వెంటనే ఆసుపత్రికి..!
వైమానిక దళం వేసిన బాంబు బౌద్ధ చాతుర్మాసంలో 100 మందికి పైగా ఉన్న మఠం సమీపంలోని ఒక ఇంటి మీద పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.