© 2026 nimisham.in

ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన దగ్గరి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగుపయనమైంది. అందులో 5000 మంది
వరకు యూఎస్ నావికులు, మెరైనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు (US sailors Thailand). 200 రోజులకు పైగా వారు జలాల్లోనే ఉండటంతో కనీస సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ నౌక థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చేరనుంది. ఇలాంటి సమయంలో నగరంలోని సెక్స్‌వర్కర్లను (Pattaya sex workers) లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది.
థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో పట్టాయా నగరం ఉంటుంది. ఈ సిటీ నైట్‌లైఫ్, బీచ్‌లకు ఫేమస్. ఇప్పుడు దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని లేమ్ చాబాంగ్ పోర్టు వద్ద యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ లంగరు వేయనుంది. ఇంతకాలం గల్ఫ్జలాల్లో విధులు నిర్వర్తించడం ఆ నౌక చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు అది వెనక్కి వచ్చిన తర్వాత నావికులు, మెరైనర్లు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వనున్నారు (US Navy Thailand visit). దీంతో ఈ నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచ్‌ల సమీపంలో, నైట్ లైఫ్ ఏరియాల్లో పెట్రోలింగ్‌ను పెంచారు. గత వారాంతంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నౌక వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని చెప్పడం కష్టమని పోలీసులు వెల్లడించారు (Pattaya crackdown).
ఇలాంటి నౌకల రాకతో ఇదొక ప్రతికూల అంశమే అయినా.. ఆర్థికంగా పట్టాయాకు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ నగరం ప్రధానంగా పర్యాటకం, వినోదరంగంపైనే ఆధారపడింది. అలాగే హోటళ్లు, రెస్టారంట్లు, బార్లు, దుకాణాలు, ఇతర వ్యాపారాలు మరింత లాభసాటిగా మారతాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. వ్యభిచారం థాయ్‌లాండ్‌లో చట్టవిరుద్ధం. కానీ పట్టాయా, బ్యాంకాంక్ సహా పలు పర్యాటక ప్రాంతాల్లో అది విరివిగా కనిపిస్తుంటుంది.
ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న పట్టాయా.. ఇప్పుడు వినోద కేంద్రం మారింది. అందుకు వియత్నాం యుద్ధమే కారణం. నాడు థాయ్‌లాండ్‌లో మోహరించిన అమెరికా సైనికులు.. విశ్రాంతి, వినోదం కోసం పట్టాయాకు వచ్చేవారు (US Navy Thailand visit). కాలక్రమంలో అదొక పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందింది.
ఇదిలాఉంటే.. ఫిబ్రవరి నెలలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మామూలుగా పసిఫిక్ మహాసముద్ర జలాల్లో ఉండే శాన్‌డియాగో పోర్ట్ వద్ద అబ్రహాం లింకన్‌ను మోహరించి ఉంచుతారు. కానీ పశ్చిమాసియా ఉద్రిక్తతలకు కొన్ని వారాల ముందు అది గల్ఫ్ జలాల్లోకి ప్రవేశించింది. నాటి నుంచి అక్కడే విధుల్లో ఉన్న ఈ నౌక.. ఇటీవలే గల్ఫ్ జలాలను వీడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.