© 2026 nimisham.in

కలసపాడు: చిన్నారులకు సకాలంలో టీకాలు ఇవ్వాలని వైద్య అధికారి శైలజ తెలిపారు. బుధవారం ఆమె వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం రాజుపాలెం గ్రామంలోని వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
టీకాల డ్యూ లిస్ట్, మాత శిశు ప్రగతి రికార్డ్స్ పరిశీలించారు. గర్భిణీగా నమోదు అయిన వెంటనే మొదటి టీకా వేసి పోర్టల్లో నమోదు చేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకట సుబ్బమ్మ, హెల్త్ అసిస్టెంట్ రామతీర్థం, లక్ష్మీ, ఆశా కార్యకర్త నూర్జహాన్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.