© 2026 nimisham.in

కరోనా కష్ట కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి ‘రియల్ హీరో’ అనిపించుకున్నారు నటుడు సోనూ సూద్. ఇప్పుడు నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.
నిత్యావసరాలు, సహాయక సామగ్రితో నేపాల్ రాజధాని కాఠ్మాండూ వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ‘‘మనం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నందుకు అదృష్టవంతులం. మనమంతా కలసి వారికి ఓ కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్.. నువ్వు ఒంటరి కాదు’’ అని సోనూ సూద్ పేర్కొన్నారు. ⇒ వివరాలు నేపాల్.. నువ్వు ఒంటరి కాదు: సోనూ సూద్ |