© 2026 nimisham.in

మిడ్జిల్: మట్టిలో దాగిన మాణిక్యం వెలుగులోకి వచ్చింది. ప్రతిభకు పట్టుదల, కఠోర శ్రమ తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపింది ఈ విద్యార్థిని. మల్లాపూర్‌కు చెంది
న పౌర్ణమి డిస్కస్ త్రోలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. జిల్లా కేంద్రంలో అక్షర జూనియర్ కాలేజీలో చదువుతున్న పౌర్ణమి, అండర్-18 విభాగంలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో డిస్కస్ త్రోను 30.47 మీటర్ల దూరం విసిరి, ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై తన క్రీడా జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తండ్రి ప్రోత్సాహమే విజయ ప్రయాణంలో తండ్రి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహం ప్రత్యేకంగా నిలిచింది. కుమార్తెలోని క్రీడా ప్రతిభను చిన్ననాటి నుంచే గుర్తించి, ఆమె కలలకు అండగా నిలుస్తూ నిరంతరం ప్రోత్సహించారు. సాధనలో అలసట ఎదురైనా, పోటీల్లో సవాళ్లు ఎదురైనా ధైర్యం నింపుతూ ముందుకు నడిపించారు.
పౌర్ణమి ఎంపికపై హర్షం డిస్కస్ త్రోలో పౌర్ణమి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల డీవైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, అథ్లెటిక్ సెక్రటరీ శరత్ చంద్ర, పీడీ ఆనంద్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ వేదికపై కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.