© 2026 nimisham.in

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Minister Konda Surekha targets cm revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వివాదం అంశంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కొండా సురేఖ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. పదేండ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, తొలుత చర్యలు ఆయనపై తీసుకొవాలని ఏకీపారేశారు. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు. ఇక తాజాగా.. మరల మీడియా సమావేశంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారన్నారు. ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడలేదు.. ఫోన్ చేసి పిలిస్తే బలవంతంగా వెళ్లామని వాళ్లే చెబుతున్నారన్నారు. వెనకనుండి మాట్లాడించిన వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదన్నారు. కానీ ఎవరు చెప్పించారో మాకు తెలుసని కొండాసురేఖ పేర్కొన్నారు.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడిందన్నారు. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టమన్నారు. నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలి కులమని, మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయన్నారు. నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదని గొడవ నడుస్తుందన్నారు.
అసలు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని మాట్లాడారు. నన్ను ఏమైనా చేయాలి అంటే ఏఐసీసీనే చేయాలని, ఎందుకంటే నేను ఏఐసీసీ సభ్యురాలినని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. తన మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కోరారు.
Read more: Konda Surekha: నాపై కాదు.. ముందు సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకొండి.!. ఢిల్లీలో బాంబు పేల్చిన కొండా సురేఖ..!
నా మీద ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తెలుసు.. అధిష్టానం వాళ్ల గురించి కూడా ఆలోచించాలన్నారు. మీనాక్షి నటరాజన్ మేడంకు నేను చెప్పాల్సింది అంతా చెప్పానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నన్ను అధిష్టానం అయితే రాజీనామా చేయమని అడగలేదని, ఒకవేళ రేవంత్ రెడ్డి పెడుతున్న ఒత్తిడికి అధిష్టానం బర్తరఫ్ చేస్తే చేయనివ్వండన్నారు. నేను మాత్రం రాజీనామా చేయను, రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టినట్లు తెల్చి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.