© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
EPFO: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోని ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొంది.. ఈపీఎఫ్ చట్టం ప్రకారం.. అధికారిక మినహాయింపు ఉత్తర్వులు లేని పీఎఫ్ ట్రస్టుల కోసం వన్ టైమ్ పరిష్కార పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన ట్రస్టులు తమ మినహాయింపు హోదాను క్రమబద్ధీకరించేందుకు డిసెంబర్ 28వ తేదీ వరకు గడువును విధించింది. ఈ మరకు 2026 జూన్ 29న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది.
దీని ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద గుర్తింపు ఉండి.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని సెక్షన్ 17 లేదా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 143 కింద అధికారిక మినహాయింపు లేని పీఎఫ్ ట్రస్టులకు ఈ ఆమ్నేస్టీ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక పరివర్తన చర్యగా.. 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలతో ఈపీఎఫ్ఓ 2026 జులై 11న ఒక సర్య్కులర్ కూడా జారీ చేసింది.
ఈ స్కీమ్ ద్వారా ట్రస్టులు తమ హోదాను గడిచిన కాలానికి వర్తించే విధంగా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో నిర్దేశించిన పలు నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా కనీస ఉద్యోగుల సంఖ్య, కనీస కార్పస్ పరిమాణం, 3ఏళ్ల పాటు నిబంధనలు పాటించాలన్న షరతు నుంచి ఉపశమనం కలుగుతుంది. క్రమబద్దీకరణ తర్వాత సంబంధిత సంస్థలు మినహాయింపు పొందిన సంస్థగా లేదంటే మినహాయింపు లేని సంస్థగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.
అర్హతగల పీఎఫ్ ట్రస్టులలో ఈ అమ్నెస్టీ పథకంపై అవగాహన కల్పించేందుకు ఈపీఎఫ్ఓ ఒక భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం, ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఏఐ) వంటి వృత్తిపరమైన సంస్థల సహాయాన్ని తీసుకుంటోంది. కంపెనీల చట్టబద్ధమైన.. ఆదాయపు పన్ను ఆడిట్లను నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, అర్హతగల ట్రస్టులను సులభంగా గుర్తించగలరని ఈపీఎఫ్ఓ ఆశిస్తోంది. ఈ పథకం వివరాలను తమ సభ్యులకు తెలియజేసి, అర్హతగల ట్రస్టులు ముందుకు వచ్చేలా ప్రోత్సహించమని ఇది ఐసిఏఐని కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.