© 2026 nimisham.in

ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ చారిత్రక ఘట్టానికి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వేదికైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి, పవిత్ర జలాలను శిరస్సున చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ ప్రమాణం ఆచరించి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన క్షణాన తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఓ దశలో కాలువ నుంచి నీరు ప్రవహిస్తుంటే, చంద్రబాబు మెడలోని పచ్చ కండువా తీసి గాల్లో గిరగిరా తిప్పి తన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి మిగతా నేతలు, రైతులు కూడా తమ కండువాలను గాల్లో ఊపుతూ హర్షం వెలిబుచ్చారు.అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెగ్యులేటర్ బటన్ నొక్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలోకి గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా, ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల