© 2026 nimisham.in
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి వేళ కన్నయ్యకు ఎరుపు రంగు దుస్తులతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని చాలా మంది నమ్ముతారు.
అంతేకాదు మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి వేళ లడ్డూ గోపాలుడి అలంకరణ కోసం వెండి ఆభరణాలు లేదా వస్తువులను ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల బాల వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు పొందొచ్చు.
మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి రోజున లడ్డూ గోపాలుడిని లహరియ(అలల వంటి లేదా చారల) డిజైన్ కలిగిన వస్త్రాలతో అలంకరించాలి. ఇలాంటి అలంకరణ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కన్నయ్యకు ఎంతో ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మదినోత్సవం రోజున బాల గోపాలుడిని తెల్లని దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది.
సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణా జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని పచ్చని రంగు దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీకు కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది.
తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ బాల గోపాలుడిని కుంకుమ రంగు(కాషాయం వంటి) రంగు వస్త్రాలతో అలంకరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కన్నయ్యను ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించొచ్చు. దీని వల్ల సంతోషం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక పరమైన రంగాల్లో మంచి లాభాలొస్తాయి.
ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణాష్టమి వేళ బాల గోపాలుడికి పసుపు రంగు వస్త్రాలతో అలంకరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది.
మకర రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వంటి పవిత్రమైన రోజున బాలగోపాలుడికి పసుపు, ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల కన్నయ్య అనుగ్రహం లభించే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నేరవేరొచ్చు.
కుంభ రాశి వారికి కూడా శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ బాల గోపాలుడిని నీలం రంగు వస్త్రాలతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించొచ్చు.
మీన రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారు శ్రీ కృష్ణాష్టమి వేళ లడ్డూ గోపాలుడికి పీతాంబరం(పసుపు రంగు) వస్త్రాలతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. Read Latest Religion News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి